pakistan cricket: పాకిస్థాన్ కు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్

  • పాక్ టూర్ కు వెళ్లబోమంటున్న విండీస్ క్రికెటర్లు
  • పర్యటన వాయిదా వేసే ఆలోచనలో విండీస్ బోర్డు
  • షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు జరగాల్సి ఉంది

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కష్టాలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఆ దేశంలో ఆడాల్సిన టీ20 సిరీస్ ను వాయిదా వేసేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. పాక్ లో భద్రతపై విండీస్ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్ ను వాయిదా వేసుకోవడమే మేలనే నిర్ణయానికి విండీస్ బోర్డు వచ్చింది.

ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది మూడు టీ20లను ఆడటానికి విండీస్ జట్టు పాకిస్థాన్ కు వెళ్లాల్సి ఉంది. గతేడాది కూడా పాక్ లో పర్యటించేందుకు విండీస్ నిరాకరించింది. దీంతో, ఈ మ్యాచ్ లను తటస్థ వేదిక యూఏఈలో నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతుండటంతో, పాక్ బోర్డు సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల పాక్ లో వరల్డ్ ఎలెవెన్, శ్రీలంక జట్లు పర్యటించాయి. దీంతో, ఇతర జట్లలో మార్పు వస్తుందని పీసీబీ భావించింది. కానీ, పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు.

More Telugu News