farhan akhtar: లైంగిక వేధింపులు సినీరంగంలోనే కాదు.. అన్ని చోట్లా ఉన్నాయి: ఫర్హాన్ అఖ్తర్

  • లైంగిక వేధింపులకు పాల్పడేవారిని వదలరాదు
  • బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేయాలి
  • న్యాయం జరిగేంత వరకు పోరాడాలి

తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటూ పలువురు బాలీవుడ్ నటీమణులు ఇటీవలి కాలంలో బహిరంగ ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి స్వర భాస్కర్ మాట్లాడుతూ, తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు మద్యం తాగి, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.

ఇలాంటి ప్రకటనలపై బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్ స్పందించాడు. లైంగిక వేధింపులు ఒక్క సినీరంగానికే పరిమితం కాదని, అన్ని చోట్లా ఉన్నాయని అన్నాడు. ఈ విషయంలో కేవలం ఫిలిం ఇండస్ట్రీని మాత్రమే బలి చేయడం సరికాదని చెప్పాడు. బాధిత మహిళలు ఏదో ఒక రూపంలో తమకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేయాల్సిందేనని, న్యాయం లభించేంత వరకు పోరాటం చేయాలని అన్నాడు.

లైంగిక వేధింపులకు పాల్పడేవారిని వదలకూడదని చెప్పాడు. లింగ భేదం లేనప్పుడే సమాజం ముందుకు వెళుతుందని తెలిపాడు. తన సినిమాల్లో అందరికీ సమ ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న వారిలో ఫర్మాన్ కూడా ఒకడు కావడం గమనార్హం. 

  • Loading...

More Telugu News