gujarath: గిర్ అభయారణ్యంలో బైకులపై వెంబడిస్తూ, సింహాలను వెంటాడుతున్న యువకులు.,.. వీడియో చూడండి!

  • గుజరాత్ అడవుల్లో ఘటన
  • ఏసియన్ సింహాలను భయపెడుతూ ఆనందం
  • నిన్న సోషల్ మీడియాకు ఎక్కిన యువకుల చర్యలు
  • ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు

గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో తమకు తారసపడ్డ సింహాలను బైకులపై వెంబడిస్తూ, కొందరు యువకులు వాటిని భయపెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ అధికారులు విచారణకు ఆదేశించారు. అడవిలో వెళుతున్న వీరికి ఓ సింహం కుటుంబం తారసపడగా వీరిక రెచ్చిపోయారు. బైకుల ఎక్స్ లేటర్ ను పెంచుతూ, వాటి వెనుక పరుగులు తీయిస్తుంటే, తమకు ఎదురవుతున్న ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆ సింహాలు పరుగులు తీశాయి.

 ఏషియన్ లయన్ జాతికి చెందిన సింహాలు ఉరుకులు పెడుతుంటే, మొత్తం నలుగురు యువకులు వాటి వెంట పడి తమ రాక్షసానందాన్ని తీర్చుకున్నారు. ఈ వీడియోను నిన్న సోషల్ మీడియాలో పెట్టగా, అభయారణ్యంలోకి బైకులతో చొరబడింది ఎవరన్న విషయాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీడియో ఎక్కడి నుంచి, ఎవరి పేరిట అప్ లోడ్ అయిందో తెలుసుకుని నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News