Aishwarya Rai: ఐశ్వర్య పోలికలతో మోడలింగ్ రంగంలో పర్షియన్ భామ!

  • కొత్త ఐశ్వర్యారాయ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు
  • ఐశ్వర్య పోలికలతో పర్షియన్ మోడల్ మహల్గా జుబేరీ
  • ఇండియాలో పాప్యులర్ అంటూ హర్షం
మోడలింగ్ రంగానికి మరో ఐశ్వర్యారాయ్ దొరికింది. 1994 మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన ఐశ్వర్యారాయ్ మోడలింగ్ రంగంలో ఒక వెలుగు వెలిగింది. అంతర్జాతీయ బ్రాండ్లకు ఆమె ఇప్పటికీ అంబాసిడర్ గా, మోడల్ గా ఉన్నారు. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఐశ్వర్యారాయ్ స్టార్ హీరోయిన్ గా నిలిచింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే దిగ్గజ బచ్చన్ కుటుంబంలో కోడలిగా కొత్త జీవితం ప్రారంభించింది.

ఇక అసలు విషయానికి వస్తే, కాలిఫోర్నియాలోని సాన్ డియోగోకు చెందిన పర్షియన్ మోడల్ మహల్గా జుబేరీ అచ్చం ఐశ్వర్యారాయ్ లా ఉందంటూ సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ఆమె కూడా స్పందించింది. తన ఫోటోలు ఇండియన్ సర్కిల్ లో బాగా పాప్యులర్ అయ్యాయని, ఒక ఇండియన్ న్యూస్ పేపర్ లో కూడా వచ్చాయని హర్షం వ్యక్తం చేసింది. 
Aishwarya Rai
mahalga juberi
model
viral

More Telugu News