vijay devarakonda: మహేష్ సోదరి మంజుల మాటలను ఫాలో అయిన విజయ్ దేవరకొండ... షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఏం చేస్తున్నాడో చూడండి!

  • 'మనసుకు నచ్చింది' షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసిన మంజుల
  • ఆమె ప్రతిభకు ప్రశంసల వర్షం
  • ఏకంగా ఆమెను ఫాలో అయిపోయిన విజయ్ దేవరకొండ
  • మనసు చెప్పిందంటూ నిద్ర పోవడానికి మంచమెక్కాడు!
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల, నిన్న ఫాలో 'యువర్ హార్ట్', 'మంజులా అఫీషియల్' ట్యాగ్ లైన్స్ యాడ్ చేస్తూ, 'మనసుకు నచ్చింది' అనే పేరుతో తన జీవితంపై ఓ షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది చూసిన వారంతా మంజులలో దాగున్న ప్రతిభకు ఫిదా అవుతూ, ప్రశంసలు కురిపిస్తున్న వేళ, నటుడు విజయ్ దేవరకొండ మరో అడుగు ముందుకేసి, ఆమెను ఫాలో అయిపోయాడు.

తన మనసు చెప్పిందని చెబుతూ, షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించాడు. "షూటింగ్ క్యాన్సిల్. నిద్ర పోవాలని నా మనసు చెప్పింది" అని వ్యాఖ్యానించాడు. మంచం ఎక్కేసి దుప్పటి కప్పుకున్న ఓ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు. అదిప్పుడు వైరల్ అయింది. విజయ్ పోస్టు చేసిన ఆ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.
vijay devarakonda
manasuku nachindi
Mahesh Babu
manjula

More Telugu News