pavan: త్రివిక్రమ్ చెప్పినా ఆగని రూమర్స్ .. 'అజ్ఞాతవాసి'పై వెంకటేశ్ మూవీ ఛాయలు?

  • త్రివిక్రమ్ తాజా చిత్రంగా 'అజ్ఞాతవాసి'
  • ఈ సినిమా కథపై షికార్లు చేస్తోన్న పుకార్లు
  • రీసెంట్ గా క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్ 
  • అయినా పుకార్లకు ఫుల్ స్టాప్ పడలేదు      
త్రివిక్రమ్ ఇంతకుముందు తెరకెక్కించిన 'అ ఆ' .. ఒక నవల ఆధారంగా రూపొందడంతో, ఆయన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' కూడా ఓ నవల ఆధారంగానే తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం లేదనీ .. తన స్టైల్లోనే ఈ సినిమా ఉంటుందని త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చాడు. అయినా ఈ రూమర్స్ ఆగడం లేదు .. పైగా గతంలో వెంకటేశ్ చేసిన 'ఒంటరి పోరాటం' సినిమా ఛాయలు 'అజ్ఞాతవాసి'లో కనిపిస్తాయనే టాక్ వినిపిస్తోంది.

 'ఒంటరి పోరాటం'లో వెంకటేశ్ ను ఒక ఆయుధంగా ఉపయోగించుకుని, శత్రువులపై జయసుధ తన పగ తీర్చుకుంటుంది. ఇక 'అజ్ఞాతవాసి'లో పవన్ ను ఆయుధంగా వాడుకుని తన శత్రువులపై ఖుష్బూ ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో పవన్ తాను ఎవరనే విషయాన్ని దాచిపెడుతూ అజ్ఞాతంలో తిరుగుతూ ఉంటాడట. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టారని అంటున్నారు. జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.   
pavan
keerthi suresh
anu emmanuel

More Telugu News