Game Of Ayodhya: బాబ్రీ మసీదు కూల్చివేతపై సినిమా.. ‘గేమ్ ఆఫ్ అయోధ్య’ రిలీజ్ డేట్ ప్రకటన!

  • ఫిల్మ్ ట్రైబ్యునల్ జోక్యంతో ఎట్టకేలకు విడుదలవుతున్న సినిమా
  • బయటకు రాని ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయన్న దర్శకుడు
  • ప్రేమ కథ నేపథ్యంలో సాగుతుందని వివరణ

బాబ్రీ మసీదు విధ్వంసం ఆధారంగా రూపొందిన ‘గేమ్ ఆఫ్ అయోధ్య’ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నట్టు దర్శకుడు సునీల్ సింగ్ తెలిపారు. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఓ ప్రేమ కథ ద్వారా చెప్పేందుకు ప్రయత్నించినట్టు ఆయన పేర్కొన్నారు. ఎవరికీ తెలియని, బయటకు రాని పలు విషయాలను ఈ సినిమా ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు  సర్టిఫికెట్ ఇచ్చేందుకు తొలుత సెన్సార్ బోర్డు నిరాకరించింది. అయితే ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రైబ్యునల్ జోక్యంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

దేవాలయం-మసీదు వివాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం, ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతుండడంతో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సీబీఎఫ్‌సీ నిరాకరించింది. మత విద్వేషాలను ఈ సినిమా రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది. అయితే ఈ సినిమాను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించామని, 1992లో ఆ దురదృష్టకరమైన రోజు అక్కడి వారి జీవితాలను ఎలా మార్చివేసిందో చెప్పే ప్రయత్నం చేశామని చెబుతూ సింగ్ ఫిల్మ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. అది ఓకే చెప్పడంతో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘గేమ్ ఆఫ్ అయోధ్య’లో సింగ్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించారు.

  • Loading...

More Telugu News