Prakash Raj: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: ప్ర‌కాశ్ రాజ్

  • పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ప్ర‌కాశ్ రాజ్ విమ‌ర్శ‌లు
  • సామాన్యులు ఇబ్బందులు ప‌డ్డారు
  • ధ‌న‌వంతులు అనేక మార్గాల ద్వారా డ‌బ్బుని మార్చుకున్నారు
  • కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద త‌ప్పు చేసింది

ఈ మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డుతోన్న సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి సోషల్ మీడియా ద్వారా స‌ర్కారుని ప్ర‌శ్నించారు. పెద్ద‌నోట్లను ర‌ద్దు చేసి నేటికి ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా ప్ర‌కాశ్ రాజ్ స్పందిస్తూ, పెద్ద నోట్లను రద్దు చేసి కేంద్ర స‌ర్కారు పెద్ద తప్పు చేసిందని అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నల్లధనాన్ని నిరోధించేందుకు, ఉగ్రవాదులకు నిధులు వెళ్ల‌కుండా చూసేందుకు గ‌త ఏడాది మోదీ పెద్దనోట్ల రద్దును చేశాన‌ని చెప్పుకున్నార‌ని ప్ర‌కాశ్ రాజ్ అన్నారు. అయితే, ధనికులు ఎన్నో మార్గాల ద్వారా నల్లధనాన్ని మార్చుకున్నార‌ని చెప్పారు. దీంతో సామాన్య‌ ప్రజలు అనేక బాధలుపడ్డారని చెప్పారు. కాగా, ఇటీవ‌ల క‌మ‌లహాస‌న్ చేసిన హిందుత్వ వ్య‌తిరేక వ్యాఖ్య‌ల‌కు ప్ర‌కాశ్ రాజ్ కూడా మ‌ద్ద‌తు తెలిపిన విష‌యం తెలిసిందే.  

More Telugu News