anushka: అనుష్క ద్విపాత్రాభినయంపై స్పందించిన దర్శకుడు!

  • విడుదలకి సిద్ధమవుతోన్న 'భాగమతి'
  • ప్రధాన పాత్రలో అనుష్క 
  • అనుష్క పాత్రపై ఊహాగానాలు 
  • స్పష్టత నిచ్చిన దర్శకుడు      

అనుష్క అభిమానులంతా 'భాగమతి' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చింది. ఈ పోస్టర్ బయటికి వచ్చిన తరువాత .. ఇది ఫాంటసీ టచ్ తో కూడిన కథ అనీ, అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ విషయంపై దర్శకుడు అశోక్ స్పందిస్తూ, ఫాంటసీని ఏ రకంగానూ టచ్ చేయని కథ ఇదని అన్నారు.

ఇక అనుష్క ద్విపాత్రాభినయం గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో .. థ్రిల్లింగ్ గా అనిపించే స్క్రీన్ ప్లే తో ఈ సినిమా కొనసాగుతుందని అన్నారు. 'అరుంధతి' .. 'రుద్రమదేవి' మాదిరిగానే 'భాగమతి' కూడా అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.       

More Telugu News