mrps: మంత్రి ఈటలను రోడ్డుపై తిరగనివ్వం: మంద కృష్ణ మాదిగ

  • భారతి మరణానికి కేసీఆరే కారణం
  • ఫిట్స్ వల్ల చనిపోయిందన్న ఈటల వ్యాఖ్యలు అవాస్తవం 
  • పోలీసులు నెట్టడం వల్లే ప్రాణాలు పోయాయి

ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని మంద కృష్ణ మాదిగ అన్నారు. దీన్నుంచి తప్పించుకునేందుకే రూ. 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారని మండిపడ్డారు. భారతి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళా పోలీసులు బలంగా ఆమెను నెట్టడం వల్లే చనిపోయిందని... ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసుల చర్యను ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని... ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భారతి ఫిట్స్ తో చనిపోయిందని ఈటల అన్నారని, దాన్ని నిరూపించకపోతే ఈటలను రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరించారు. రేపట్నుంచి 19వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతామని, 20న భారతి సంస్మరణ సభ నిర్వహిస్తామని తెలిపారు.

More Telugu News