Cashless approach: ఇది తొలి క్యాష్ లెస్ విలేజ్... వెలుగులోకి షాకింగ్ నిజాలు!

  • డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించిన కేంద్రం
  • తొలి ‘క్యాష్‌ లెస్ విలేజ్‌’గా మధ్యప్రదేశ్ లోని బడంఝిరా గ్రామం ఎంపిక 
  •  దానిని ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం డిజిటలైజేషన్ వైపు మొగ్గాలన్న కేంద్రం
  • ఏడాది తరువాత ఆ గ్రామంలో అంతా నగదు లావాదేవీలే!

దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో దేశంలోనే తొలి ‘క్యాష్‌ లెస్ విలేజ్‌’గా మధ్యప్రదేశ్ లోని బడంఝిరా గ్రామాన్ని ప్రకటించింది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని దేశమంతా క్యాష్ లెస్ విధానంవైపు నడవాలని, డిజిటలైజేషన్ దిశగా మారాలని సూచించింది. ఈ సంస్కరణ ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ గ్రామంలో పరిస్థితులపై మీడియా ఆరాతీయగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

 భోపాల్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో క్యాస్ లెస్ విధానం ఎప్పుడో నిలిచిపోయింది. అక్కడ ఇప్పుడు అన్నీ నగదు వ్యవహారాలే నడుస్తుండడం విశేషం. క్యాష్‌ లెస్ గ్రామంగా ప్రకటించిన సందర్భంలో ఆ ఊర్లో విరివిగా దర్శనమిచ్చిన పీఓఎస్ మిషన్లు ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. ఆ మిషన్లను ఆ గ్రామ వ్యాపారులు తిరిగి బ్యాంకులకు ఇచ్చేసినట్టు సమాచారం.

ఆ గ్రామంలో జరిగే నగదు రహిత లావాదేవీలకు పీఓఎస్ మిషన్లు ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి వాటిని తిరిగి ఇచ్చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం క్యాష్ విధానమే నడుస్తోందని వ్యాపారులు తెలిపారు. దీంతో కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటలైజేషన్ అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా భావించవచ్చని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News