manasuku nachchindi: హీరోయిన్ కావాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యా: మహేష్ సోదరి మంజుల ఆవేదన... మహేష్ షేర్ చేసిన వీడియో చూడండి!

  • 'మనసుకు నచ్చింది' పేరిట లఘుచిత్రం
  • ఎన్నో విషయాలను ప్రస్తావించిన మంజుల
  • చక్కటి ప్రయత్నమని అభినందించిన మహేష్
తనకూ అందరు అమ్మాయిల్లానే ఎన్నో కలలు ఉండేవని, కానీ తాను వాటిని నెరవేర్చుకోలేకపోయానని సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల వాపోయింది. నేడు ఆమె పుట్టిన రోజు కాగా, 'మనసుకు నచ్చింది' అన్న టైటిల్ తో తన జీవితంపై ఓ లఘు చిత్రాన్ని తీసి దాన్ని మహేష్ బాబు ట్విట్టర్ టైమ్ లైన్ లో పోస్టు చేసింది.

దీనిపై మహేష్ స్పందిస్తూ, "నా ప్రియమైన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చక్కటి ప్రయత్నం" అని అభినందించారు. ఇక ఈ వీడియోను "హాయ్ నేను మంజుల..." అంటూ ప్రారంభించిన మంజుల ఇందులో ఎన్నో విషయాలను ప్రస్తావించింది. చాలా కలలు కన్నానని, ఏదో సాధించాలని ప్రయత్నించి విఫలమయ్యానని వాపోయింది. నటిని కావాలని భావించానని, కానీ అవలేకపోయానని, ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని చెప్పుకొచ్చింది.

ఆ బాధను మరచిపోయేందుకు సినిమా నిర్మాణంపై దృష్టిని సారించానని, అది కూడా సంతృప్తిని ఇవ్వలేదని చెప్పింది. ఓడిపోతూ, అవకాశాలు రాని వేళ, తనకు తానే ఓ బాధితురాలిగా అనుకుంటూ ఎంతో ఫీల్ అవుతుండేదాన్నని మంజుల తన లఘు వీడియోలో చెప్పుకొచ్చింది.


manasuku nachchindi
Mahesh Babu
Manjula

More Telugu News