team india: చివరి టీ20లో భారత్ గెలవడానికి కారణం ఇదే: రవిశాస్త్రి

  • సిరీస్ ను గెలుచుకోవడం పట్ల శాస్త్రి హర్షం
  • మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు
  • బుమ్రా చాలా తెలివైన ఆటగాడు
న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో విజయం సాధించిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. గతంతో ఎన్నడూ కివీస్ పై టీ20 మ్యాచ్ ను గెలవని టీమిండియా... ఇప్పుడు ఏకంగా సిరీస్ ను కైవసం చేైసుకోవడం పట్ల హెడ్ కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా తెలివైన ఆటగాడని... ప్రత్యర్థి జట్టుకు ఏ అవకాశాన్నీ ఇవ్వలేదని కొనియాడాడు. చివరి టీ20లో బుమ్రా 9 పరుగులకు 2 వికెట్లను కూల్చాడు.

మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే టీమిండియా విజయం సాధ్యమైందని శాస్త్రి అన్నాడు. భారత ఇన్నింగ్స్ ముగిశాక... ఆ స్కోరును కాపాడుకోగలమనే భావించామని చెప్పాడు. 8 ఓవర్ల ఈ మ్యాచ్ లో కేవలం 2 లేదా 3 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపం మారిపోయే అవకాశం ఉంటుందని తెలిపాడు. అద్భుతమైన క్యాచ్ లు పడుతూ, పరుగులను నియంత్రించడంలో కోహ్లీ సేన సఫలమైందని చెప్పాడు. ఒత్తిడి లేకుండానే ఆడామని ఎవరైనా చెబితే, అది కచ్చితంగా అబద్ధమేనని అన్నాడు. 
team india
t20
newzealand series
ravi shastri

More Telugu News