Virat Kohli: కోహ్లీ ఇన్ స్టా గ్రాం పోస్టుకి ధర ఎంతో తెలుసా?

  • ఒక్కో యాడ్ కి 4 కోట్ల రూపాయలు 
  • సోషల్ మీడియాలో 16.7 మిలియన్ల మంది ఫాలోయర్స్
  • ఇన్ స్టా గ్రాం ప్రమోషన్ కి 3.2 కోట్ల రూపాయలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ బ్రాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వివిధ వాణిజ్య సంస్థలు టీమిండియా ఆటగాళ్లలో ఎవరితోనైనా యాడ్ చెయ్యాలంటే ముందుగా సంప్రదించేది విరాట్ నే. ఇలా ఆయన చేసే యాడ్స్ కు 4 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నాడు. ఇక తనకున్న పాప్యులారిటీతో కోహ్లీ సామాజిక మాధ్యమాలను భారీ సంఖ్యలో అభిమానులు ఆనుసరిస్తున్నారు.

ప్రస్తుతం కోహ్లీ ఇన్ స్టా గ్రాంను 16.7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. దీంతో ఏదైనా ఉత్పత్తి గురించి కోహ్లీ తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు పెడితే (ప్రమోట్ చేస్తే) దానికి సుమారు 3.2 కోట్ల రూపాయల ఛార్జ్ అందుకుంటున్నాడట. దీంతో కోహ్లీ బ్రాండింగ్ పీక్స్ లో ఉందని తెలుస్తోంది. కాగా, బ్రాండ్ వాల్యూలో అంతర్జాతీయ ఫుట్‌ బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీని సైతం కోహ్లీ దాటేయడం విశేషం. 
Virat Kohli
team india
add's
brand
brand value
branding

More Telugu News