sexual: ప‌నిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల ఫిర్యాదు కోసం ఆన్‌లైన్‌ పోర్ట‌ల్‌

  • ప్రారంభించిన కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌
  • `షి-బాక్స్‌` పేరుతో ప్రారంభం
  • ఆవిష్క‌రించిన మంత్రి మేన‌కా గాంధీ

ప‌నిచేసే చోట లైంగిక వేధింపుల‌కు గుర‌వుతున్న మ‌హిళ‌ల స‌హాయార్థం ఓ ఆన్‌లైన్ ఫిర్యాదు పోర్ట‌ల్‌ను కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ప్రారంభించింది. ఈ పోర్ట‌ల్‌ను కేంద్ర మంత్రి మేన‌కా గాంధీ ఆవిష్క‌రించారు. `షి-బాక్స్ (SHe-box)` పేరిట ఈ పోర్ట‌ల్ ను మ‌హిళా శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పోర్ట‌ల్ ద్వారా రిజిస్ట‌ర్ అయిన ప్ర‌తి ఒక్క ఫిర్యాదును మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ప‌రిశీలించి సంబంధిత అంత‌ర్గ‌త ఫిర్యాదు క‌మిటీల‌కు పంపిస్తుంది.

ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సంస్థ‌ల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగులు ఈ పోర్ట‌ల్‌లో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు ఫిర్యాదు స్టేట‌స్‌ను కూడా ఈ పోర్ట‌ల్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. లైంగిక వేధింపుల చట్టం 2013 ప్ర‌కారం ప‌ది కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థ‌లో లైంగిక వేధింపుల ఫిర్యాదుల‌ను ప‌ట్టించుకునేందుకు అంత‌ర్గ‌త ఫిర్యాదుల క‌మిటీల‌ను కేంద్రం త‌ప్ప‌నిస‌రి చేసింది.

More Telugu News