apcc: పెద్దనోట్ల ర‌ద్దుకు ఏడాది... రేపు ఏపీసీసీ భారీ ర్యాలీ, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు!

  • విజ‌య‌వాడ‌లో రేపు నిర‌స‌న కార్య‌క్ర‌మం
  • ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ర్యాలీ ప్రారంభం
  • ఉద‌యం 10. 30 గంట‌ల‌కు లెనిన్ సెంట‌ర్‌లో నిర‌స‌న కార్య‌క్ర‌మం
  • సాయంత్రం 5.30 నిమిషాల‌కు క్యాండిల్ ప్ర‌ద‌ర్శ‌న

పెద్ద‌నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌ల‌ను అష్ట‌క‌ష్టాలు పెట్టిన భార‌తీయ జ‌న‌తా పార్టీ, ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ తీరుకు నిర‌సన‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్‌.ర‌ఘువీరారెడ్డి అధ్వ‌ర్యంలో రేపు విజ‌య‌వాడ‌లో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టనున్న‌ట్లు ఏపీసీసీ ప్ర‌క‌ట‌న చేసింది. పాత‌ పెద్ద‌నోట్లను ర‌ద్దు చేసి సంవ‌త్స‌రం అవుతోన్న నేప‌థ్యంలో రేపు ఉదయం విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ర్యాలీ బ‌య‌లుదేరుతుంద‌ని ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు.

ఉద‌యం 10.30 గంట‌ల‌కు లెనిన్ సెంట‌ర్‌లో నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని, సాయంత్రం 5.30 నిమిషాల‌కు మ‌ళ్లీ ఏపీసీసీ కార్యాల‌యం నుంచి క్యాండిల్ ప్ర‌ద‌ర్శ‌న, ర్యాలీ ప్రారంభం అవుతాయని చెప్పారు. మోదీ నిర్ణ‌యంతో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌లు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ని, దేశం ఆర్థికంగా బ‌ల‌హీన‌ప‌డిపోయింద‌ని ర‌ఘువీరారెడ్డి విమర్శించారు.  

More Telugu News