రాజధానిని కమ్మేస్తున్న వాయు కాలుష్యం... ఢిల్లీలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్!
- ప్రజలు బయటికి రావొద్దని కోరిన ఐఎంఏ అధ్యక్షుడు
- పాఠశాలలు కూడా మూసివేయాలని వినతి
- ఢిల్లీ హాఫ్ మారథాన్ రద్దు చేయాలని సీఎంకు విజ్ఞప్తి
ఇటీవల ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యత ఒక్కసారిగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గాల్లో కాలుష్య కారకాల పరిమాణం పర్టిక్యులెట్ మ్యాటర్ 2.5, 10ల విలువ 452, 336ల స్థాయికి వెళ్లింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీని విలువ 25 ఉండాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్న భారతీ ఎయిర్‌టెల్, ప్రభుత్వం ఆదేశిస్తే మారథాన్ ఆపేందుకు సిద్ధమని పేర్కొంది. మరి, దీనిపై ఢిల్లీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!