truck: కారులోంచి ట్రక్కులోకి దూకిన దొంగ‌లు.. రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ్డ వైనం.. వీడియో చూడండి!

  • స్వీడన్‌లో ఘ‌ట‌న‌
  • ట్రక్కు తాళాన్ని పగలగొట్టిన దుండ‌గులు
  • సీసీకెమెరాల సాయంతో గుర్తించిన సెక్యూరిటీ
  • వెంట‌నే స్పందించిన పోలీసులు

ఇటీవ‌ల స్వీడన్‌లో జ‌రిగిన ఓ చోరీకి సంబంధించిన దృశ్యాలు వైర‌ల్‌గా మారాయి. సినిమా సీన్ల‌ను త‌ల‌పించేలా దొంగ‌లు కారులో ఓ భారీ ట్ర‌క్కు వెన‌కాలే వెళ్లారు. కారు డోర్లు తెర‌చుకుని దానికి వేళాడుతూ ట్రక్కు తాళాన్ని పగలగొట్టి ట్రక్కులోకి దూకారు. అనంత‌రం ట్ర‌క్కులో ఉన్న కొన్ని వ‌స్తువుల‌ను చోరీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే, ఆ ట్ర‌క్కులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఈ విష‌యం వెంట‌నే సెక్యూరిటీ సిబ్బందికి తెలిసింది.

దీంతో వెంట‌నే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. త‌క్ష‌ణ‌మే స్పందించి అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ట్ర‌క్కులోకి దూరి చోరీ చేస్తోన్న ముగ్గురిని ప‌ట్టుకున్నారు. సినిమా సీన్‌ను త‌ల‌పించే ఈ దృశ్యాల‌ను మీరూ చూడండి...

More Telugu News