iphone x: ఐఫోన్ ఎక్స్ అమ్మ‌కాల‌తో భారీగా లాభ‌ప‌డిన ఆపిల్‌?

  • ఫోన్ త‌యారీకి అయిన ఖ‌ర్చు రూ. 23,200
  • ఫోన్ అమ్మకపు ధ‌ర రూ. 64,800
  • లెక్క‌లు అంచ‌నా వేసిన టెక్ఇన్‌సైట్స్ సంస్థ‌

ఆపిల్ సంస్థ ప్రతిష్ఠాత్మ‌కంగా విడుద‌ల చేసిన ఐఫోన్ ఎక్స్ అమ్మ‌కాల ద్వారా భారీ లాభాల‌నే ఆర్జించిన‌ట్లు తెలుస్తోంది. గ‌త మోడ‌ల్ ఐఫోన్ 8తో పోలిస్తే దాదాపు 43 శాతం అధిక లాభాల‌ను గ‌డించిన‌ట్లు స‌మాచారం. ఆపిల్ లాభాల లెక్క‌ల‌ను అంచ‌నా వేస్తూ టెక్ఇన్‌సైట్స్ అనే సంస్థ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం ఐఫోన్ ఎక్స్ త‌యారీకి ఆపిల్ సంస్థ 357.50 డాల‌ర్లు (దాదాపు రూ. 23,200) ఖ‌ర్చు పెట్టింది. కానీ త‌యారీ పూర్త‌య్యాక ఐఫోన్ ఎక్స్‌ను 999 డాల‌ర్లకి (దాదాపు రూ. 64,800) అమ్మింది. అంటే ఒక్కో ఫోన్ మీద దాదాపు 64 శాతం మార్జిన్ లాభంగా పొందింద‌న్న‌మాట‌.

అయితే టెక్ఇన్‌సైట్స్ క‌థ‌నాలపై స్పందించేందుకు ఆపిల్ సంస్థ నిరాక‌రించింది. అయితే త‌మ అంచ‌నాల‌కు మ‌ద్ద‌తుగా ఐఫోన్ ఎక్స్‌లో ఉప‌యోగించిన విడిభాగాల ధ‌ర‌ల‌ను కూడా టెక్ఇన్‌సైట్స్ వెల్ల‌డించింది. ఐఫోన్ ఎక్స్‌లో వాడిన 5.8 ఇంచుల డిస్‌ప్లేకి 65.50 డాల‌ర్లు (రూ. 4,300), బాడీ త‌యారీకి ఉప‌యోగించిన స్టెయిన్‌లెస్ స్టీల్‌కి 36 డాల‌ర్లు (రూ. 2,300) అయి ఉంటుంద‌ని టెక్ఇన్‌సైట్స్ తెలిపింది.

More Telugu News