hanipreet singh: జైలుకి వచ్చి మీడియా కంటబడకుండా ఉండేందుకు హనీప్రీత్ కుటుంబ సభ్యుల పాట్లు!

  • హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైల్లో ఉన్న హనీప్రీత్ సింగ్
  • జైలులోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచకుల కోర్టులో విచారణకు హాజరైన హనీప్రీత్
  • మరో 12 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం
  • ఈనెల 17న తదుపరి విచారణ

డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ను కలిసేందుకు అంబాలా సెంట్రల్ జైలుకు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మీడియా కంటబడకుండా ఉండేందుకు నానాతంటాలు పడ్డారు. గుర్మీత్ సింగ్ ను పోలీసుల నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన కేసులో హనీప్రీత్ సింగ్, సుఖదీప్ లు రిమాండ్ ఖైదీలుగా హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసు విచారణ నిమిత్తం, జైలులోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచకుల కోర్టులో నిందితులను అధికారులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మరో 12 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి హనీప్రీత్ ను న్యాయస్థానం జైలుకు అప్పగించింది. విచారణ నేపథ్యంలో హనీప్రీత్ ను కలుసుకునేందుకు ఆమె అన్నావదినలు, సోదరి జైలుకి వచ్చారు.

ఈ సందర్భంగా మీడియా కంటబడకుండా వారు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 14 నిమిషాల పాటు వారు నిందితులతో మాట్లాడారు. హనీప్రీత్ కోసం వారు పలు వస్తువులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 17న జరగనుందని న్యాయస్థానం తెలిపింది. 

  • Loading...

More Telugu News