ileana: ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: ఇలియానా

  • తన శరీరంపై కామెంట్లకు ఒత్తిడికి లోనయ్యా
  • నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ బయటపడ్డా
  • మేము అందంగా కనిపించడానికి రెండు గంటల సమయం పడుతుంది

ఒకానొక సమయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని... ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని గోవా బ్యూటీ ఇలియానా తెలిపింది. తన శరీరాకృతి గురించి చాలా కామెంట్లు చేసేవారని, దాంతో తాను చాలా ఒత్తిడికి గురయ్యేదాన్నని తెలిపింది. అలాంటి సమయంలో తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ, నెమ్మదిగా డిప్రెషన్ నుంచి బయటపడ్డానని చెప్పింది.

మన మెదడులో జరిగే రసాయన చర్యలకు అనుగుణంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని... దానంతట అదే తగ్గిపోతుందిలే అనుకుంటే, ఆ తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుందని తెలిపింది. డిప్రెషన్ కు లోనయినప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలని సూచించింది. సినిమావాళ్లను చూడగానే చాలా అందంగా ఉన్నారని అందరూ అనుకుంటూ ఉంటారని... తాము ఇంత అందంగా కనిపించడానికి రెండు గంటల సమయం పడుతుందని చెప్పింది.

 అయితే, మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మేకప్ లు అవసరం లేదని తెలిపింది. ఢిల్లీలో నిన్న జరిగిన 21వ 'వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్' కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఇక్కడ ప్రసంగిస్తూ జీవితంలో తాను ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి మాట్లాడింది. 'ఉమెన్ ఆఫ్ సబ్ స్టెన్స్' అవార్డును కూడా అందుకుంది. 

  • Loading...

More Telugu News