mohammed siraj: హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్ కు మద్దతుగా మాట్లాడిన జస్ప్రీత్ బుమ్రా!

  • సిరాజ్ కొత్తగా జట్టులోకి వచ్చాడు
  • తదుపరి మ్యాచ్ లో కుదురుకుంటాడు
  • సిరాజ్ లో ఆత్వవిశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తున్నాం
టీమిండియా కొత్త పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు జస్ప్రీత్ బుమ్రా అండగా నిలిచాడు. పొరపాట్ల నుంచి సిరాజ్ నేర్చుకుంటాడని చెప్పాడు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన సిరాజ్ ఏకంగా 53 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ తీశాడు.

ఈ సందర్భంగా బుమ్రా మాట్లాడుతూ, సిరాజ్ కొత్తగా జట్టులోకి వచ్చాడని... క్లిష్టమైన వికెట్ పై బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టమేనని అన్నాడు. మన బౌలింగ్ లో బ్యాట్స్ మెన్లు షాట్లు కొడుతుంటే, దాన్నుంచి మనం కచ్చితంగా చాలా నేర్చుకుంటామని తెలిపాడు. తర్వాత మ్యాచ్ లో సిరాజ్ కుదురుకుంటాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. సిరాజ్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు తామంతా ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.
mohammed siraj
jaspreet bumrah
team india
t20
newzealand series

More Telugu News