Andhra Pradesh: జబర్దస్త్‌లో డ్యాన్సులు చేసే రోజా ఓ తింగరబుచ్చి!: మంత్రి అయ్యన్నపాత్రుడు

  • రోజాకు ఏమీ తెలియదు.. ఆమె మాటలను ఎవరూ విశ్వసించరు
  • ధర్మాన వంటి సీనియర్ నాయకుడు అలాగేనా మాట్లాడేది? 
  • ఎద్దేవా చేసిన మంత్రి 
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫైరయ్యారు. ఆమెనో తింగరబుచ్చిగా అభివర్ణించారు. ఆమె మాటలను ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా శనివారం విశాఖపట్టణం జిల్లా చీడికాడలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ చీఫ్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్న రోజా వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ జబర్దస్త్‌లో డాన్సులు చేసే తింగరబుచ్చికి ఏమీ తెలియదని అన్నారు. జగన్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని ఆమె తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఆమె చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్న మంత్రి వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ నాయకులు కూడా అడ్డగోలుగా చౌకబారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అయ్యన్న ఎద్దేవా చేశారు.
Andhra Pradesh
Ayyanna patrudu
Roja
YSRCP

More Telugu News