Rajasekhar: మరో వివాదంలో హీరో రాజశేఖర్ కుటుంబం.. యాక్సిడెంట్ చేసిన కుమార్తె శివాని!

  • రాజశేఖర్ కుటుంబాన్ని వీడని వివాదాలు
  • మొన్న రాజశేఖర్.. నేడు శివాని
  •  రూ.30 లక్షలు డిమాండ్ చేస్తున్న బాధితుడు
ఇటీవల హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొట్టిన నటుడు రాజశేఖర్ గురించి వార్తలు హల్‌చల్ చేశాయి. ఇప్పుడు ఆయన పెద్ద కుమార్తె శివాని కూడా ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. జూబ్లీహిల్స్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుందీ ఘటన. ఆమె నడుపుతున్న కారు అదుపు తప్పి ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. అయితే ప్రమాదం చిన్నది కావడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

అయితే, బాధితుడు మాత్రం తనకు రూ. 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తాను కారు కొని రెండు వారాలైనా గడవలేదని, కాబట్టి తనకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ అతను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదు. ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న శివాని త్వరలో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేయనుంది.
Rajasekhar
Shivani
tollywood
Accident

More Telugu News