china: జాతీయ గీతాన్ని అగౌర‌వ‌ప‌రిస్తే జైలు శిక్ష‌... స్ప‌ష్టం చేసిన చైనా ప్ర‌భుత్వం

  • మూడేళ్ల వ‌రకు శిక్ష‌ప‌డే అవ‌కాశం
  • ఆదేశం జారీ చేసిన అధికార పార్టీ
  • తీర్మానం చేసిన ఎన్‌పీసీ స్టాండింగ్ క‌మిటీ

జాతీయ గీతాన్ని కించ‌ప‌రచ‌డం క్రిమిన‌ల్ నేర‌మ‌ని, అందుకు మూడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని చైనా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. జాతీయ‌వాదుల‌ విన‌తుల మేర‌కు అధికార‌ క‌మ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జాతీయ గీతాన్ని అగౌర‌వ ప‌రచ‌డాన్ని క్రిమిన‌ల్ నేరంగా ప‌రిగణించాల‌ని తీర్మానం చేస్తూ క్రిమిన‌ల్ చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ వారి స్టాండింగ్ క‌మిటీ తీర్మానించుకుంది. చైనా జాతీయ ప‌తాకాన్ని, చిహ్నాన్ని అవ‌మాన‌ప‌రిస్తే అమ‌లు చేసే శిక్ష‌లే జాతీయ గీతాన్ని కించ‌ప‌రిచినా అమ‌లు చేయాల‌ని చైనా ప్ర‌భుత్వం ఆదేశించింది.

More Telugu News