Devendra fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇంకు చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నించి అల‌జ‌డి రేపిన కుర్రాడు!

  • అంద‌రినీ దాటుకుని సీఎంకు దగ్గరగా వచ్చేందుకు య‌త్నించిన యువ‌కుడు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఈ రోజు ఉదయం రాలేగావ్‌ సిద్ధీలో ఘ‌ట‌న‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై ఇంకు చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నించి ఓ యువ‌కుడు క‌ల‌క‌లం రేపాడు. అత‌డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ యువ‌కుడిని విచారిస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే, ఈ రోజు ఉదయం రాలేగావ్‌ సిద్ధీలో ఫ‌డ్న‌విస్ ఓ శంకుస్థాపన క్యార్యక్రమానికి వెళ్లారు.

అక్క‌డ‌కు వ‌చ్చిన ఓ యువకుడు అంద‌రినీ దాటుకుని సీఎంకు దగ్గరగా వచ్చేందుకు ప్ర‌యత్నించాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భద్రతా సిబ్బంది అత‌డిని అడ్డుకుని ఇంక్‌ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఎంపై ఆ యువ‌కుడు ఈ చ‌ర్యకు పాల్ప‌డ‌డానికి య‌త్నించిన కార‌ణాల‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

More Telugu News