srikanth: ప్ర‌పంచ నెంబ‌ర్ 2 ర్యాంకు సాధించిన కిడాంబి శ్రీకాంత్‌

  • కెరీర్‌లో ఉత్త‌మ ర్యాంకింగ్‌
  • వ‌రుస‌గా సూప‌ర్ సిరీస్‌లు గెల్చుకుంటూ వెళ్లిన శ్రీకాంత్‌
  • మొద‌టిస్థానంలో డెన్మార్క్ ఆట‌గాడు విక్ట‌ర్ అక్సెల్స‌న్‌

తాజాగా అప్‌డేట్ అయిన ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుప‌డి భార‌త ష‌ట్ల‌ర్ కిడాంబి శ్రీకాంత్ ప్ర‌పంచ నెంబ‌ర్ 2 ర్యాంకు సాధించాడు. ఇది త‌న కెరీర్‌లోనే ఉత్త‌మ ర్యాంకింగ్‌. 2017లో శ్రీకాంత్‌ వ‌రుస‌గా ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఓపెన్‌, డెన్మార్క్ ఓపెన్‌, ఫ్రెంచి ఓపెన్ ఇలా నాలుగు సూప‌ర్ సిరీస్‌లు గెల‌వ‌డంతో 73,403 పాయింట్లు శ్రీకాంత్ సొంత‌మ‌య్యాయి.

ఈ విజ‌యాలే శ్రీకాంత్‌కి నెంబ‌ర్ 2 ఘ‌న‌త సాధించేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి. ఈ సంద‌ర్భంగా కిడాంబి శ్రీకాంత్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఎలాగైనా క‌ష్ట‌ప‌డి నెంబ‌ర్ 1 ర్యాంకు సాధించేందుకు కృషిచేస్తాన‌ని శ్రీకాంత్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా 77,930 పాయింట్లతో డెన్మార్క్ క్రీడాకారుడు విక్ట‌ర్ అక్సెల్స‌న్ మొద‌టిస్థానంలో నిలిచాడు.

More Telugu News