cheetah: అడవిలో అరుదైన దృశ్యాన్ని బంధించిన ఫోటోగ్రాఫర్!

  • జాంబియా అడవుల్లో మొసలిని వేటాడిన చిరుత
  • సాధారణంగా ఇతర జంతువులను వేటాడి తినే మొసలి
  • తన కెమెరాలో బంధించిన వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్
కథల్లో చెప్పే కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవులకు కేరాఫ్ అడ్రెస్ ఆఫ్రికా ఖండం అన్న సంగతి తెలిసిందే. అక్కడి జాంబియాలోని ఒక అడవిలో అరుదైన దృశ్యాన్ని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. సాధారణంగా క్రూర జంతువులు అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఒకదానినొకటి చంపుకుంటాయి. మొసళ్లకు ఈ నియమం వర్తించదు. ఎందుకంటే ఇంతవరకు వేరే జంతువు మొసలిని చంపి తిన్న సందర్భాలు లేవనే చెప్పాలి. పుస్తకాల్లో కూడా అలాంటి ప్రస్తావనలేదు.

 ఈ నేపథ్యంలో జాంబియా దేశంలోని అడవిలో ఒక మడుగు దగ్గర నీరు తాగేందుకు వెళ్లిన చిరుత ఒడ్డున ఉన్న మొసలిని వేటాడి తినేసింది. దీనిని ఒక ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. సాధారణంగా ఏదైనా జంతువు మడుగు దగ్గరకు వస్తుందన్న అలికిడి వినిపిస్తే మొసళ్లన్నీ అప్రమత్తమై అందులోనికి వెళ్లిపోతాయని, ఆహారం అవసరమైన మొసళ్లు మాత్రం నీటి అడుగున మాటువేస్తాయని ఆ ఫోటోగ్రాఫర్ తెలిపారు. మొసళ్లు ఇతర జంతువులను వేటాడుతాయి కానీ..మొసళ్లను వేరే జంతువులు వేటాడడం గురించి తనకు తెలియదని ఆయన చెప్పాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా, ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
cheetah
alligator
leopard
crocodile

More Telugu News