jagan: వెంకన్న దర్శనం అనంతరం స్వరూపానందేంద్రకు కానుకలిచ్చి ఆశీర్వాదం పొందిన జగన్

  • ఈ ఉదయం తిరుమలకు వచ్చిన జగన్
  • దర్శనం అనంతరం విశాఖ శారదా పీఠానికి
  • స్వరూపానందేంద్రతో పాదయాత్రపై చర్చించిన జగన్
ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని తన పాదయాత్రను విజయవంతం చేయాలని మొక్కుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, అనంతరం విశాఖ శారదా పీఠానికి వెళ్లారు. అక్కడే ఉన్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి పండ్లు కానుకగా ఇచ్చి ఆశీర్వాదం పొందారు. ఆపై ఆయనతో కాసేపు చర్చలు జరిపారు.

పాదయాత్ర జరిపే మార్గం గురించి వెల్లడించారు. జగన్ తో పాటు స్వరూపానందేంద్రను కలిసిన వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు వున్నారు.
jagan
swaroopanandendra
tirumala

More Telugu News