tirumala: 'హిందూ మతంపై నమ్మకం ఉంది' అని చెబుతూ డిక్లరేషన్ అడిగిన టీటీడీ... కోపంగా చూసి, సున్నితంగా తిరస్కరించిన జగన్!

  • తిరుమలలో అన్య మతస్తులకు ప్రవేశం నిషేధం 
  • ఈ ఉదయం దైవ దర్శనానికి వచ్చిన జగన్
  • ఆలయ సమీపంలో ఎదురెళ్లి డిక్లరేషన్ అడిగిన అధికారులు
  • తిరస్కరించి వెళ్లిపోయిన జగన్

తాను తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ, వైకాపా అధినేత వైఎస్ జగన్, ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. హిందూ ఆధ్యాత్మిక, భక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలోకి అన్య మతస్తుల ప్రవేశం నిషిద్ధమన్న సంగతి తెలిసిందే. ఒకవేళ వస్తే, తమకు హిందూ విశ్వాసాల మీద నమ్మకం ఉందని తెలుపుతూ ఓ డిక్లరేషన్ ఇవ్వాల్సి వుంటుంది.

ఆలయం వద్దకు జగన్ ప్రవేశించిన తరువాత కొందరు టీటీడీ అధికారులు ఆయనకు ఎదురెళ్లి డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో వారివైపు ఆగ్రహంగా చూసిన జగన్, ఆపై తమాయించుకుని సున్నితంగా తిరస్కరించి దర్శనానికి వెళ్లిపోయారు. జగన్ తో పాటు పలువురు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకున్నారు.

More Telugu News