andhra pradesh: చంద్రబాబు సర్కారుకు షాకిచ్చిన కేంద్రం... డీజీపీ ప్రాబబుల్స్ జాబితా తిరస్కరణ!

  • ఏడుగురి పేర్లతో జాబితా పంపిన ఏపీ
  • రిటైర్ మెంట్ కు దగ్గరున్న వారి పేర్లను ఆక్షేపించిన కేంద్రం
  • వీళ్లకు రెండేళ్ల పదవీకాలం ఎలాగని ప్రశ్న
  • సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమే
  • కొత్త ప్యానల్ పంపాలన్న హోం శాఖ

తదుపరి డీజీపీగా ఎవరిని నియమించాలన్న విషయమై ఏపీ సర్కారు తయారు చేసి కేంద్ర హోం శాఖకు పంపిన జాబితా తిరస్కరణకు గురైంది. ఈ జాబితాను వెనక్కు పంపిన కేంద్రం, ఏడాది లోగా పదవీ విరమణ చేయనున్న వారి పేర్లను తెలుపుతూ, వారిని రెండేళ్ల పదవీ కాలానికి ఎలా నియమిస్తారని ప్రశ్నించింది.

పూర్తిస్థాయి డీజీపీగా ఒకరిని నియమించాలని చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏడుగురి పేర్లను కేంద్రానికి పంపింది. వీటిలో ఏడాది లోపు రిటైర్ అవుతున్న వారూ ఉన్నారు. రమణమూర్తి, సాంబశివరావు, మాలకొండయ్యలు త్వరలోనే రిటైర్ కానున్నారు. రిటైర్ మెంట్ ముందున్న వారిని డీజీపీగా నియమించి, ఆపై వారి పదవీ కాలం కొనసాగిస్తామని చెప్పడం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని అభిప్రాయపడ్డ కేంద్రం, కొత్త ప్యానల్ ను పంపాలని సూచించింది.

  • Loading...

More Telugu News