YSRCP: జగన్ పేరు మార్చుకోవడం లేదు.. ఆయన పేరు జగనే: స్పష్టం చేసిన వైసీపీ

  • జగన్ తన పేరును జేఎంఆర్‌గా మార్చుకుంటున్నట్టు ప్రచారం
  • టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో హోరెత్తిన ప్రచారం
  • ఖండించిన వైసీపీ శ్రేణులు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన పేరును మార్చుకుంటున్నట్టు శుక్రవారం మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. వైఎస్ జగన్ అని కాకుండా ఇకపై తన పేరును జేఎంఆర్‌గా పిలిపించుకోవాలని భావిస్తున్నట్టు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలపై  వైసీపీ శ్రేణులు స్పందించాయి. పేరు మార్పు వార్తలను ఖండించాయి.

ఇటువంటి నిరాధార వార్తలను నమ్మవద్దని పార్టీ కార్యకర్తలను, అభిమానులను కోరాయి. అలాగే ఇటువంటి వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని మీడియాను కోరాయి. ఏదైనా ముఖ్యమైన అంశం కానీ, కార్యక్రమం కానీ ఉంటే  మీడియా సమావేశంలోనో, పత్రికా ప్రకటన ద్వారానో తెలియజేస్తామని పేర్కొన్నారు. కాబట్టి ఇటువంటి నిరాధార, అసత్య వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాయి.
 
కాగా, సోమవారం తన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు తెల్లవారు జామున బ్రేక్ దర్శనంలో జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ తన పర్యటనలో 13 జిల్లాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

More Telugu News