Kamal Haasan: అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమలహాసన్‌పై కేసుల న‌మోదు.. రేపు విచార‌ణ

  • హిందూ ఉగ్ర‌వాదం అంటూ మత విశ్వాసాల‌ను దెబ్బ‌తీసేలా వ్యాఖ్యలు
  • రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటోన్న నేప‌థ్యంలో ఇటువంటి వ్యాఖ్య‌లు
  • మండిప‌డుతోన్న ప్ర‌ముఖులు
  • ఐపీసీ సెక్షన్లు 511, 298, 295 (ఏ), 505 (సీ) కింద కేసులు

'హిందూ ఉగ్ర‌వాదం' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమలహాసన్‌పై దేశంలోని ప‌లువురు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఉద్దేశం ఉంటే మంచి ప‌నులు చేసి రావాల‌ని, ఇటువంటి వ్యాఖ్య‌లు చేసి వార్తల్లో నిల‌వాల‌ని చూడ‌కూడ‌ద‌ని అంటున్నారు. దీంతో ఆయ‌న‌పై ప‌లు సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేశారు. ఒక మ‌తాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు సెక్షన్‌ 500 కింద కేసు న‌మోదు చేశారు.

అలాగే 511 సెక్ష‌న్‌ కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్‌ 298 కింద పరుష వ్యాఖ్యలతో మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్‌ 295(ఏ) కింద మత విశ్వాసాలను కించపరచడం, మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్‌ 505(సీ) కింద ఒక వర్గంపైన, మతంపైన దాడులు చేసేలా మాట్లాడ‌డం వంటి అభియోగాలపై కమలహాసన్ కేసుల్లో ఇరుక్కున్నాడు. రేపు ఈ కేసుల‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. కాగా, క‌మ‌ల హాస‌న్ ఈ నెల 7న త‌న అభిమానుల‌తో క‌లిసి పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్నారు. ఆ రోజున కొత్త పార్టీపై క‌మ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని కొంద‌రు భావిస్తున్నారు.  

More Telugu News