cricketer: క్రీడల్లో మైండ్ గేమ్స్ గురించి పుస్తకం రాస్తున్న గంగూలీ

  • స్పష్టం చేసిన క్రికెటర్
  • ఆత్మ‌క‌థ రాసేందుకు ఆస‌క్తి లేద‌ని వెల్ల‌డి
  • పుస్త‌కాలు రాయ‌డం క‌ష్ట‌మైన ప‌ని అన్న గంగూలీ

ఓపిగ్గా కూర్చుని రాయడం లేదా వ‌ర్ణించ‌డం, అచ్చు వేయడం ఆల‌స్యం కాకుండా ఉండేందుకు స‌రైన స‌మ‌యంలో ప‌బ్లిష‌ర్‌కి పంపించ‌డం వంటి ప‌నులు చాలా చిరాకు తెప్పిస్తాయ‌ని గ‌తంలో చాలా సార్లు చెప్పిన మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ... ఇప్పుడు ఓ పుస్త‌కం రాస్తున్న‌ట్లు తెలుస్తోంది. క్రీడ‌ల్లో మైండ్ గేమ్స్ గురించి పుస్త‌కం రాస్తున్న‌ట్లు గంగూలీ ఓ కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించాడు. క్రీడ‌ను అల‌వ‌రుచుకోవ‌డంలో ఆట‌గాడి ఆలోచ‌న‌ల గురించి ఈ పుస్త‌కంలో వివ‌రిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపాడు.

భార‌త క్రికెట‌ర్ల‌లో కెప్టెన్‌గా మంచి పేరు సంపాదించుకోవ‌డం, కోచ్ గ్రెగ్ చాపెల్‌తో వివాదం వంటి చాలా అంశాలు గంగూలీ బ‌యోగ్ర‌ఫీ రాయ‌డానికి ఉప‌యోగ‌ప‌డేవ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే త‌న‌కు మాత్రం ఆత్మ‌క‌థ రాసేందుకు కానీ, రాయించేందుకు కానీ ఆస‌క్తి లేద‌ని గంగూలీ స్ప‌ష్టం చేశాడు. అంతేకాకుండా పుస్త‌కాలు రాయడం, చ‌ద‌వ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అని గంగూలీ అన్నాడు.

More Telugu News