ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెల్చినందుకు పాకిస్థాన్ జ‌ట్టు పేరుతో త‌పాలా బిళ్ల‌

  • విడుద‌ల చేసిన పాకిస్థాన్ త‌పాలా సేవా సంస్థ‌
  • జూన్ 18న ఫైన‌ల్లో భార‌త్‌ను ఓడించిన పాక్‌
  • ట్వీట్ చేసిన పాక్ ప్ర‌భుత్వం
జూన్‌లో జ‌రిగిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో పాకిస్థాన్ జ‌ట్టు, భార‌త జ‌ట్టును ఓడించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యానికి ప్ర‌తీక‌గా పాకిస్థాన్ త‌పాలా సేవా సంస్థ వారి జ‌ట్టు పేరుతో త‌పాలా బిళ్లలు విడుద‌ల చేసింది. రూ. 5, రూ. 10 విలువగల త‌పాలా బిళ్లల‌ను విడుద‌ల చేశారు.

వీటిలో ఒక‌దానిపై జ‌ట్టు ఫొటో, మ‌రో దానిపై ఛాంపియ‌న్స్ ట్రోఫీ బొమ్మ‌ల‌ను ముద్రించారు. జూన్ 18న లండ‌న్‌లోని ఓవ‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో 180 ప‌రుగుల తేడాతో భార‌త్ మీద పాక్ విజ‌యం సాధించింది. ఈ త‌పాలా బిళ్ల‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ను పాకిస్థాన్ ప్ర‌భుత్వం త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది.
Go Back to Shorts
pakistan
icc
champions trophy
india
final
oval stadium
london

More Telugu News