garudavega: రాజశేఖర్ ట్రైలర్ చూసి చిరంజీవి ఏమన్నారో తెలుసా?.. అయితే ఈ వీడియో చూడండి!

  • చిరంజీవికి ట్రైలర్ చూపించిన రాజశేఖర్
  • అద్భుతంగా ఉందన్న మెగాస్టార్
  • రాజశేఖర్ మళ్లీ పుంజుకుంటారన్న చిరు

మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లి ప్రముఖ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవితలు కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన తాజా చిత్రం 'గరుడవేగ' ట్రైలర్ ను చిరంజీవికి చూపించారు రాజశేఖర్. అనంతరం రాజశేఖర్ ను చిరంజీవి అభినందించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఈ సినిమా రాజశేఖర్ కు 'కమ్ బ్యాక్' మూవీ అవుతుందని చిరు అన్నారు. 'గరుడవేగతో' రాజశేఖర్ మళ్లీ పుంజుకుంటారని చెప్పారు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా... ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

More Telugu News