ap: పది డిగ్రీలకు పడిపోయిన తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత!

  • ఆదిలాబాద్, విశాఖలో కనిష్ఠ ఉష్ణోగ్రత
  • హైదరాబాద్ లో 18 డిగ్రీలు
  • కనిపించని వాయుగుండం ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో శీతల పవనాల ధాటి పెరిగింది. ఉష్ణోగ్రతలు తాజా కనిష్ఠాలకు చేరాయి. ఈ సీజన్ లో తొలిసారిగా 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు గత రాత్రి పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. ఆదిలాబాద్, విశాఖ జిల్లాలో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వచ్చే వారంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు.

గత రాత్రి హైదరాబాద్ లో 18 డిగ్రీలు, కరీంనగర్ లో 16 డిగ్రీలు, తిరుపతిలో 16.5 డిగ్రీలు, ఒంగోలులో 19 డిగ్రీలు, గుంటూరులో 19.5 డిగ్రీలు, రాజమండ్రిలో 18 డిగ్రీలు, కర్నూలులో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలను నమోదయ్యాయి. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేదని, అందువల్లే ఇతర దక్షిణాది ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

More Telugu News