Cheteshwar Pujara: చరిత్ర సృష్టించిన పుజారా.. 12 డబుల్ సెంచరీలు బాదిన తొలి ఇండియన్‌గా రికార్డు!

  • విజయ్ మర్చంట్ రికార్డును బద్దలు గొట్టిన పుజారా
  • టీమిండియా తరపున కూడా మూడు ‘డబుల్స్’
  • అందులో రెండు ఆస్ట్రేలియా పైనే!

టీమిండియా ఓపెనర్ చటేశ్వర్ పుజారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీ 2017-18లో భాగంగా సౌరాష్ట్ర-జార్ఖండ్ మధ్య రాజ్‌కోట్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రెండోరోజు గురువారం డబుల్ సెంచరీ చేసిన పుజారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 డబుల్స్ సాధించిన ఒకే ఒక్క ఇండియన్‌గా తన పేరును లిఖించుకున్నాడు. తద్వారా ఇప్పటి వరకు విజయ్ మర్చంట్ పేరుపై ఉన్న రికార్డును బద్దలుగొట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో విజయ్ హరారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్‌లు ఉన్నారు.

కాగా, చటేశ్వర్ పుజారా టీమిండియా తరపున కూడా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేయగా, వాటిలో రెండు ఆస్ట్రేలియాపైన చేసినవే కావడం గమనార్హం. సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా ఈ మ్యాచ్‌లో 204 పరుగులు చేసి ఔటయ్యాడు.

More Telugu News