America: బాప్‌రే! ఉగ్రవాదంపై పోరుకు రోజుకు రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్న అమెరికా!

  • 11/2001లో పోరు మొదలుపెట్టిన అమెరికా
  • 16 ఏళ్లుగా ఊపరి సలపని పోరాటం
  • ఇప్పటి వరకు అయిన మొత్తం ఖర్చు రూ.94 లక్షల కోట్లు
ఉగ్రవాదంపై పోరుకు నడుం బిగించిన అమెరికా ఉగ్రవాదుల ఏరివేతకు చేస్తున్న ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. రోజుకు రూ.1600 కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ. 94 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సెప్టెంబరు 11, 2001లో ట్విన్ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడి తర్వాత రంగంలోకి దిగిన అమెరికా గత పదహారేళ్లుగా రోజుకు రూ.1600 కోట్ల చొప్పున ఖర్చు చేస్తోంది. ఈ మేరకు అమెరికా డిఫెన్స్ విభాగం పేర్కొంది. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధానికి రూ.84 లక్షల కోట్లు ఖర్చు చేయగా ఇరాక్‌, సిరియాలోని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ భరతం పట్టేందుకు రూ.1.1 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు 74 పేజీలతో కూడిన డిఫెన్స్ నివేదిక పేర్కొంది.
America
Terror Groups
Iraq
Afghanistan

More Telugu News