crocodile: భ‌యాన‌క అనుభ‌వం.. ఇంట్లో నిద్రిస్తుండ‌గా ప‌క్క‌నే చేరిన 12 అడుగుల మొస‌లి!

  • ఒడిశాలోని మ‌ల్కాన్‌గిరి జిల్లా మున్సా గ్రామంలో ఘ‌ట‌న
  • అతి భారీ మొస‌లిని చూసి వ‌ణికిపోయిన వ్య‌క్తి
  • బంధించి తీసుకెళ్లిన అట‌వీశాఖ అధికారులు
  • ఆ మొస‌లి బ‌రువు 500 కిలోగ్రాములు

ఒడిశాలోని మ‌ల్కాన్‌గిరి జిల్లా మున్సా గ్రామంలో ఓ వ్య‌క్తికి భ‌యాన‌క అనుభవం ఎదురైంది. ఇంట్లో నిద్రిస్తుండ‌గా మెలకువ వ‌చ్చి క‌ళ్లు తెర‌చిచూడ‌గా ఆయ‌న‌ ప‌క్క‌నే 12 అడుగుల మొస‌లి కన‌ప‌డింది. దీంతో ఒక్క‌సారిగా భ‌య‌ప‌డిపోయి, అక్క‌డ నిద్రిస్తోన్న ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను లేపి, బ‌య‌ట‌కు పరిగెత్తాడు.

అనంత‌రం స్థానికులకు ఈ విష‌యాన్ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ అటవీ శాఖ అధికారులు అక్క‌డ‌కు చేరుకుని ఆ మొస‌లిని బంధించి గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో వ‌దిలేశారు. అది సీతాగుడి డ్యాం నుంచి వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. ఆ మొస‌లి 500 కిలోగ్రాముల బ‌రువు ఉంద‌ని చెప్పారు.

More Telugu News