vijay: కబాలి .. బాహుబలి తరువాత స్థానంలో 'మెర్సల్'!

  • వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోన్న 'మెర్సల్'
  • ఓవర్సీస్ లో 72 కోట్ల వసూళ్లు 
  • దేశవ్యాప్తంగా 139.52 కోట్లు 
  • ప్రపంచవ్యాప్తంగా 211.44 కోట్ల గ్రాస్ వసూళ్లు

దీపావళి సందర్భంగా విడుదలైన 'మెర్సల్' భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఒక్క తమిళనాడులోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. 12 రోజుల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా 72 కోట్లు వసూలు చేయడం విశేషం. ఫ్రాన్స్ .. మలేసియాల్లోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది.

ఫ్రాన్స్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మొదటిస్థానంలో 'కబాలి' .. రెండవ స్థానంలో 'బాహుబలి' ఉండగా, మూడవస్థానంలో 'మెర్సల్' నిలిచింది. ఫ్రాన్స్ లో 10కే క్లబ్ లో చేరిన ఈ సినిమా, మలేసియాలో 17 కోట్లు రాబట్టింది. అక్కడ అత్యధిక వసూళ్లను సాధించిన మొదటి తమిళ చిత్రంగా 'కబాలి' ఉండగా .. రెండవ తమిళ చిత్రంగా 'మెర్సల్' నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా 139.52 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 211.44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 

More Telugu News