chandrababu: హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు

  • టీటీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు
  • అమరావతిలో బిజీగా ఉండటంతో.. మధ్యాహ్నం 3 గంటలకు భేటీ వాయిదా
  • గవర్నర్ ను కూడా కలవనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ బయల్దేరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు టీటీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు హాజరవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 10 గంటలకే ఈ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అమరావతిలో సీఆర్డీఏ సమావేశంతో పాటు, డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీకి సంబంధించి రైతులతో సమావేశం ఉండటంతో... చంద్రబాబు సమయానికి హైదరాబాద్ రాలేకపోయారు. దీంతో, సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. సమన్వయ కమిటీ సమావేశం తర్వాత గవర్నర్ నరసింహన్ ను చంద్రబాబు కలుస్తారు. 

  • Loading...

More Telugu News