forbes: దేశంలో అత్యంత శ‌క్తిమంత‌మైన మ‌హిళ చందా కొచ్చ‌ర్: ఫోర్బ్స్

  • ప్ర‌పంచంలో 100 మంది శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌ల జాబితా విడుద‌ల‌
  • 32వ స్థానంలో నిలిచిన ఐసీఐసీఐ సీఈఓ
  • మొద‌టి స్థానంలో నిలిచిన జ‌ర్మ‌నీ ఛాన్స్‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్‌

ప్ర‌పంచంలో 100 మంది శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌ల జాబితాను ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసింది. ఇందులో 32వ స్థానంలో నిలిచిన ఐసీఐసీఐ సీఈఓ చందా కొచ్చ‌ర్ దేశంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌గా నిలిచారు. ఇంకా ఈ జాబితాలో హెచ్‌సీఎల్ సీఈఓ రోష్ని నాడ‌ర్ మ‌ల్హోత్రా (57వ స్థానం), బ‌యోకాన్ చైర్‌ప‌ర్స‌న్ కిర‌ణ్ మజుందార్ షా (71), హిందుస్థాన్ టైమ్స్ గ్రూప్ చైర్‌ప‌ర్స‌న్ శోభ‌న భార‌తీయా (92), న‌టి ప్రియాంక చోప్రా (97) ఉన్నారు.

ఈ జాబితాలో మొద‌టి స్థానంలో జ‌ర్మ‌నీ ఛాన్స్‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్ నిలిచారు. వ‌రుస‌గా ఏడేళ్ల నుంచి ఆమె ఇదే స్థానంలో కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టివ‌రకు 12 సార్లు ఆమె మొద‌టి స్థానం సంపాదించుకున్నారు. ఈసారి అనూహ్యంగా బ్రిట‌న్ ప్ర‌ధాని థెరెసా మే రెండో స్థానంలో నిలిచారు. బ్రెగ్జిట్ వ్య‌వ‌హారంలో ప్ర‌భావ‌వంత‌మైన నిర్ణ‌యంలో ఆమె పాత్ర పోషించినందుకు థెరెసాకు ఈ ర్యాంకు ద‌క్కింది. ఇక త‌ర్వాతి స్థానాల్లో మెలిందా గేట్స్‌, షెరిల్ శాండ్‌బ‌ర్గ్, మేరీ బ‌రా, సూసెన్ వోజుకి, అబిగ‌లీ జాన్స‌న్‌, క్రిస్టీన్ ల‌గార్డే, అనా పాట్రిషియా, జిన్నీ రోమెట్టీ ఉన్నారు.

More Telugu News