raviteja: 'రాజా ది గ్రేట్'కు కొత్త సీన్స్ ను జత చేస్తున్నారు!

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'రాజా ది గ్రేట్' 
  • హిట్ కొట్టేసిన రవితేజ
  • దర్శక నిర్మాతల తాజా నిర్ణయం

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా 'రాజా ది గ్రేట్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చింది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోటా మంచి వసూళ్లను రాబడుతోంది. 3వ వారంలోకి ఎంటరైనా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తోంది.

 తాజాగా ఈ సినిమాకి కొత్తగా మూడు సీన్స్ ను జతచేయాలని ఈ సినిమా టీమ్ నిర్ణయించింది. ఈ శనివారం నుంచి ఆ కొత్త సీన్స్ ను జోడించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. నిడివి ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో ఈ సీన్స్ ను పక్కన పెట్టేసి విడుదల చేశారు. కానీ ఈ సినిమాకి లభిస్తోన్న ఆదరణ చూశాక ఆ సీన్స్ ను జోడించాలని నిర్ణయించుకున్నారు. ఇలా కొత్త సీన్స్ ను జోడించడం ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి మరి.           

More Telugu News