revant reddy: 'దొరకని దొంగ గుట్టు ర‌ట్టు' అంటూ మంత్రి కేటీఆర్ ఫొటోను పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి

  • నిన్న త‌న‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు రేవంత్ రెడ్డి కౌంట‌ర్
  • 2016లో జ‌రిగిన అఫీషియ‌ల్ పోగ్రాంలో ‘అన‌ఫీషియ‌ల్‌’గా కేటీఆర్‌
  • తేజారాజు S/O స‌త్యం రామ‌లింగ‌రాజుతో తెలంగాణ‌ ఐటీ మంత్రి
  • ఎవ‌రు స్కాంల స్టార్‌ల‌తో తిరుగుతున్నారో చెప్ప‌డానికి ఇదే సాక్ష్యం

'దొరకని దొంగ గుట్టు ర‌ట్టు' అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సంబంధించి ఓ ఫొటోను కాంగ్రెస్ నేత‌ రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. '2016లో జ‌రిగిన అఫీషియ‌ల్ పోగ్రాంలో ‘అన‌ఫీషియ‌ల్‌’గా తేజారాజు S/O స‌త్యం రామ‌లింగ‌రాజుతో మ‌లేషియ‌న్ ప్ర‌ధానిని క‌లిసి మంత‌నాలాడిన స్కాం స్టార్‌ కేటీఆర్ కు ముందుంది ‘క్రోకోడైల్ ఫెస్టివ‌ల్‌’' అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

తాను కాంగ్రెస్‌లో చేరినందుకు కేటీఆర్ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని రేవంత్‌రెడ్డి అన్నారు. స్కాం స్టార్ల‌తో తిరుగుతున్నాన‌ని నిన్న కేటీఆర్ అన్నార‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎవ‌రు స్కాంల స్టార్‌ల‌తో తిరుగుతున్నారో చెప్ప‌డానికి ఇదే సాక్ష్యం అని రేవంత్ అన్నారు. స‌త్యం రామ‌లింగ‌రాజు సుపుత్రుడితో కేటీఆర్ మ‌లేషియాలో ర‌హ‌స్యంగా వెల‌గ‌బెట్టిన నిర్వాకం ఏమిటో చెప్పాల‌ని నిల‌దీశారు.    

More Telugu News