PURI: దొరికిన ఒకే ఒక్క అరుదైన యాపిల్ ను ఎగబడి తింటున్న పూరి, చార్మి... వీడియో చూడండి

  • హిమాచల్ ప్రదేశ్ షూటింగ్ లో టీమ్
  • చేతిలో ఉన్నది ఒకటే జపాన్ యాపిల్
  • అందరూ కలిసి రుచి చూస్తూ వీడియో

ప్రస్తుతం మెహబూబా చిత్రం షూటింగ్ నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ టీమ్ కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చలి పులి చంపేస్తున్న వేళ, ఒంటినిండా స్వెట్టర్లు, జాకెట్లు ధరించిన పూరీ, చార్మి తదితరులకు ఓ జపాన్ యాపిల్ లభించింది. దాని రుచి ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ఇక అది ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరికీ ఉండటంతో చార్మితో మొదలు పెట్టి, ప్రతి ఒక్కరూ దాన్ని టేస్ట్ చేశారు. ఆ వీడియోను 'పూరీ కనెక్ట్స్' తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసుకుంది. దాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News