kamal hasan: నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ, కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు

  • పెరిగిపోయిన హిందూ ఉగ్రవాదం
  • హిందూ టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో యూపీ, గుజరాత్ విఫలం
  • కేరళ సర్కారు పనితీరు భేష్: కమల్
భారత ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని టార్గెట్ చేస్తూ, దక్షిణాది నటుడు, త్వరలోనే ఓ రాజకీయ పార్టీని పెట్టి పాలిటిక్స్ లోకి ఎంటరవుతాడని భావిస్తున్న కమలహాసన్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని ఆరోపిస్తూ, ఉత్తరాదిన ఈ టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో కేరళ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందని కితాబిచ్చారు. హిందూ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అరికట్టడంలో యూపీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా విఫలమైందని అన్నారు.
kamal hasan
bjp
modi

More Telugu News