Raghuveera Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పూర్తి రుణమాఫీ చేయాలి: ర‌ఘువీరారెడ్డి

  • వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి
  • ఇందిరమ్మ తాగునీటి, సాగునీటి పథ‌కాలకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గండికొడుతున్నాయి
  • జీఎస్టీ, నోట్ల రద్దుతో కేంద్ర ప్ర‌భుత్వం ప్రజల నడ్డి విరగ్గొట్టింది

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పూర్తి రుణమాఫీ చేయాలని, అలాగే వారికి కొత్త‌గా వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు అనంతపురం జిల్లా అగళి మండలంలో ప‌ర్య‌టించిన ర‌ఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... గతంలో రేషన్ దుకాణంలో 9 రకాల సరుకులు ఇచ్చేవార‌ని, ఇప్పుడు కూడా ఆ స్థాయిలోనే స‌రుకులు అందించాల‌ని అన్నారు.

కాగా, ఇందిరమ్మ తాగునీటి, సాగునీటి పథ‌కాలకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గండికొడుతున్నాయ‌ని ఆయన విమర్శించారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చేంతవరకు ఈ రాక్షస పాలనను ఎండగ‌డ‌తామ‌ని అన్నారు. గరిబీ హటావో అన్న ఇందిర‌మ్మ‌ నినాదం, సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ ఆశయాలు నెర‌వేరాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని చెప్పారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో కేంద్ర ప్ర‌భుత్వం ప్రజల నడ్డి విరగ్గొట్టింద‌ని అన్నారు.  

  • Loading...

More Telugu News