aadi pinisetti: పవన్ ఎంతమాత్రం స్టార్ హోదాను చూపించరు .. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు : ఆది పినిశెట్టి

  • నటుడిగా ఆది పినిశెట్టికి మంచి పేరు 
  • హీరోగాను .. విలన్ గాను సినిమాలు 
  • 'రంగస్థలం'లో మంచి పాత్ర పడింది 
  • 'అజ్ఞాతవాసి'లో పాత్ర కూడా విభిన్నమైనదే   
ఆది పినిశెట్టి తెలుగు .. తమిళ భాషల్లో వైవిధ్యభరితమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. హీరోగాను .. విలన్ గాను .. సపోర్టింగ్ రోల్స్ లోను ఆయన ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను నటుడిని .. అన్ని రకాల పాత్రలు చేయాలి .. అదే చేస్తున్నాను" అంటూ చెప్పాడు.

 " ప్రస్తుతం 'రంగస్థలం' సినిమాలోను .. 'అజ్ఞాతవాసి' సినిమాలోను డిఫరెంట్ గా వుండే పాత్రలు చేస్తున్నాను" అన్నాడు. ఇక పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ " పవన్ కల్యాణ్ చాలా సింపుల్ గా వుంటారు .. చాలా సరదాగా మాట్లాడతారు. సెట్లో స్టార్ హోదాను చూపించడానికి ఎంతమాత్రం ప్రయత్నించరు. నటుడిగాను .. వ్యక్తిగతంగాను ఆయనని దగ్గరగా చూసినప్పుడు, ఆయన నుంచి నేర్చుకోవలసినవి చాలా వున్నాయనిపించింది. అలాంటి ఆయన సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.    
aadi pinisetti

More Telugu News