mamata: ముఖేష్ అంబానీ ఇంటికొచ్చిన మమతా బెనర్జీ... విందు ఇచ్చిన పారిశ్రామిక దిగ్గజం!

  • మహారాష్ట్రలో పెట్టుబడుల కోసం పర్యటిస్తున్న మమత
  • తమ రాష్ట్రానికి రావాలని ముఖేష్ ను కోరిన పశ్చిమ బెంగాల్ సీఎం
  • శివసేన చీఫ్ ఉద్దవ్ తోనూ చర్చలు
ఇండియాలోని అత్యంత ఖరీదైన భవంతుల్లో ఒకటైన ముంబైలోని పారిశ్రామికదిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 'అంటిల్లా'కు వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆయనిచ్చిన విందును స్వీకరించారు. బెంగాల్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని, కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పేందుకు మమత వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

ముంబైకి వచ్చిన ఆమె, తాజ్ ప్యాలెస్ లో బస చేశారు. సాయంత్రం వేళ అంటిల్లాకు వెళ్లి, రాత్రి 9.45 గంటల వరకూ ఉన్నారు. మమత, మహారాష్ట్ర పర్యటన సందర్భంగా అక్కడి పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశమై తమ రాష్ట్రానికి రావాలని కోరారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేనూ కలిశారు.
mamata
uddhav
antilla
mukesh ambani

More Telugu News